‘దృశ్యం 2’లో కొన్ని మార్పులు

Venkatesh

వెంకటేష్ హీరోగా ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ మొదలు అయింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తీసిన జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. దాంతో… వెంకటేష్ ఈ సినిమా విషయంలో కలగచేసుకోవడం లేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.

ఐతే, జీతూ జోసెఫ్ మాత్రం తెలుగు వర్షన్ స్క్రిప్ట్ కి కొన్ని మార్పులు చేశారట. గతేడాది లాక్డౌన్ కారణంగా కొన్ని సీన్ల షూటింగ్ విషయంలో ఆయన మలయాళం వర్షన్ కి సంబంధించి రాజీ పడ్డారు. ఇప్పుడు ఆ బాధ లేదు కాబట్టి… తాను మొదట అనుకున్న కొన్ని సీన్లని ఈసారి మరింత పకడ్బందీగా, లావిష్ గా తీస్తున్నారు జీతూ జోసెఫ్.

‘దృశ్యం 2’ సినిమాని ఏప్రిల్ చివరి నాటికి 60 శాతం పూర్తి చేస్తారట. మిగతాది ‘నారప్ప’ విడుదల తర్వాత తీస్తారు. ఐతే, ఈ సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలి అనేది ఇంకా డిసైడ్ చెయ్యలేదు.

More

Related Stories