ఇదిగో జూనియర్ స్నేహ!

sneha daughter

ఇలా పుట్టిన వెంటనే అలా బేబీ ఫొటోల్ని షేర్ చేస్తున్న రోజులివి. పుట్టకముందే పేరు కూడా పెట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ జంటలకు ఈ విషయంలో ఆత్రం ఎక్కువ. అయితే స్నేహ-ప్రసన్న దంపతులు మాత్రం ఈ విషయంలో తొందరపడలేదు. అందుకే ఇన్నాళ్లూ కూతుర్ని కెమెరా కంటికి కనపడనీయకుండా దాచారు.

దాదాపు 7 నెలల కిందటే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది స్నేహ. కానీ ఆ బుజ్జాయి ఎలా ఉంటుందనేది బయట లోకానికి తెలియదు. ఎట్టకేలకు తన కూతుర్ని అభిమానులకు పరిచయం చేసింది స్నేహ. మూడు ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కూతురు పేరు… ఆద్యంత.

ఇన్నాళ్లూ లేనిది ఈరోజే కూతురు ఫొటోల్ని స్నేహ బయటపెట్టడానికి ఓ కారణం ఉంది. ఈరోజు స్నేహ భర్త, నటుడు ప్రసన్న బర్త్ డే. ఈ పుట్టినరోజు సందర్భంగా కూతురి ఫొటోల్ని రిలీజ్ చేసింది స్నేహ.

పెళ్లయినప్పటికీ కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది స్నేహ. అబ్బాయి పుట్టిన తర్వాత కూడా సినిమాలు చేసింది. ఇప్పుడు అమ్మాయికి జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని స్పష్టంచేసింది.

Related Stories