ఓటిటి స్టార్ గా శోభితకి క్రేజ్!

- Advertisement -
Sobhita Stills 10823 007

ఆ మధ్య నాగ చైతన్యతో డేటింగ్ కారణంగా వార్తల్లో నిలిచింది శోభిత. ఇప్పుడు ఆ విషయం సైడ్ కి వెళ్ళింది. ఐతే, ఆమె వార్తల్లో మాత్రం ఉంటోంది. దానికి కారణం ఓటిటి డ్రామాలు.

ఆమె నటించిన వెబ్ సిరీస్ లు వరుసగా విడుదల అవుతున్నాయి. మొన్న ‘నైట్ మేనేజర్ 2’ వచ్చింది. ఇప్పుడు “మేడ్ ఇన్ హెవెన్ 2” వస్తోంది. ఇలా వరుసగా వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుండడంతో వాటి ప్రమోషన్స్ తో ఆమె బిజీ బిజీ. ఓటిటి షోల కారణంగా ఆమెకి మంచి క్రేజ్ ఏర్పడింది. హాట్ హాట్ కిస్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లలో సంకోచం లేకుండా నటిస్తోంది. దాంతో ఆమెకి ఓటిటి ప్రపంచంలో ఆమెకి మంచి డిమాండ్, పాపులారిటీ వచ్చింది.

ఇప్పుడు ఈ భామ సినిమాల్లో నటించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వెబ్ సిరీస్ ల వల్ల ఆదాయం కూడా బాగుందట.

వైజాగ్ కి చెందిన ఈ తెలుగు భామ పూర్తిగా ముంబైలో సెటిల్ అయింది. నాగ చైతన్యతో డేటింగ్ మాత్రం కంటిన్యు అవుతోంది.

Also Check: Sobhita Dhulipala in Amphitrite-esque gown

More

Related Stories