చైతన్యతో లింక్, మౌనంగా శోభిత!


శోభిత ధూళిపాళ. ఈ భామ పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగిపోతోంది. దానికి కారణం… ఆమె నటించిన ‘మేజర్’ సినిమా సక్సెస్ అయిందనో కాదు. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర. కాబట్టి ఆమె గురించి మీడియా తెగ రాసే అవకాశం లేదు. ఆమె పేరు ఇప్పుడు దేశంలోని అన్ని ఫిలిం వెబ్ సైట్లలో టాప్ ప్లేస్ లో ఉండడానికి కారణం… నాగ చైతన్యతో డేటింగ్ అన్న పుకారు వల్ల.

భార్య సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఇటీవలే డేటింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడని, శోభితతో షురూ అయిందని మొదట బాలీవుడ్ లో వార్త గుప్పుమంది. సమంత ఇలాంటి పనికిమాలిన పుకార్లు పుట్టిస్తోందని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు నాగ చైతన్య అభిమానులు. వారికి సమాధానంగా, సమంత నాగ చైతన్య డేటింగ్ సంబంధించిన ఒక వార్తని రీట్వీట్ చేసింది. తాను, నాగ చైతన్య ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయామని, ప్రతిది దానికి నాలాంటి అమ్మాయిలను బ్లేమ్ చెయ్యొద్దు అన్నట్లుగా సమంత ఎదో సమాధానం ఇచ్చింది.

ఆమె ట్వీట్ వల్ల జనాలకి శోభిత, నాగ చైతన్య డేటింగ్ గురించి ఎక్కువగా తెలిసింది. శోభిత అంటే ఎవరు అని జనం ఎంక్వరి చేస్తున్నారు. ఆమె ‘గూఢచారి’, ‘మేజర్’ చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెది తెలుగులో సాధారణ జనంకి అంతగా తెలిసిన పేరు కాదు.

నాగ చైతన్య ఎప్పటిలాగే మౌనంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత కూడా ఈ పుకార్లపై, సమంత ట్వీట్ పై స్పందించడం లేదు. మౌనంగా ఉంది.

శోభిత వైజాగ్ చెందిన తెలుగు భామ. కానీ, హీరోయిన్ గా ఆమె ముందుగా బాలీవుడ్ లో పాపులర్ అయింది. ముంబైలోనే నివాసం ఉంటోంది. ‘అక్కినేని క్యాంప్’లోనే ఉండే హీరో అడివి శేష్ తో శోభిత చైతన్యకి పరిచయం అయిందట. ఐతే, వీరి మధ్య నిజంగా డేటింగ్ జరుగుతోందా? లేక కావాలనే ‘కసిగా’ కొందరు పుకార్లు లేపారా అన్నది చూడాలి.

 

More

Related Stories