ఆమె గురించి మాట్లాడను: శోభిత

Shobita 1 May 22 22


సమంత విడాకులు తీసుకోవడానికి తాను కారణం కాదు అంటోంది హీరోయిన్ శోభిత ధూళిపాళ. నాగ చైతన్య, సమంత మధ్య జరిగిన విషయాలకు, తనకు సంబంధం లేదు అని చెప్తోంది.

ప్రస్తుతం ఆమె నాగ చైతన్య గాళ్ ఫ్రెండ్.

ఇటీవల నాగ చైతన్య ‘కస్టడీ’ ప్రమోషన్ లో భాగంగా తన మాజీ భార్య సమంత గురించి మాట్లాడాడు. అలాగే తన ప్రస్తుత గాళ్ ఫ్రెండ్ కి, తన డివోర్స్ కి ముడిపెట్టొద్దు అన్నట్లుగా చెప్పాడు. “సమంత మంచి అమ్మాయి. ఆమె ఎప్పుడూ బాగుండాలి,” అని పాజిటివ్ గా మాట్లాడిన విషయం తెలిసిందే.

ఐతే, సమంత, నాగ చైతన్య విడాకులకు మూడో వ్యక్తి కారణం అనే పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. ఆ మూడో వ్యక్తి ఎవరు అనే విషయంలోనే ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు నాగ చైతన్య శోభితతో డేటింగ్ లో ఉన్నాడు కాబట్టి ఆమె వైపు వేలు వెళ్తోంది. ఐతే, తాను తప్పు చెయ్యలేదు అని అంటోంది ఈ భామ. అందుకే, సమంత గురించి గాని, సమంత, నాగ చైతన్య డివోర్స్ గురించి కానీ ఏమి మాట్లాడను అని కచ్చితంగా చెప్తోంది.

More

Related Stories