పని పూర్తిచేసిన గూఢచారి పిల్ల

”గూఢచారి” సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన తెలుగమ్మాయి, సూపర్ మోడల్ శోభిత ధూలిపాళ, మరో సినిమా పూర్తిచేసింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ”మేజర్” సినిమాకు సంబంధించి ఈమె పోర్షన్ కంప్లీట్ అయింది.

ఓ మంచి టీమ్ ను మిస్సవుతున్నానని అంటోంది శోభిత. ”మేజర్” సెట్స్ లో కష్టం, సుఖం, బాధ అన్నీ పడ్డామని.. ఓ మంచి సినిమా చేసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు శిశికిరణ్ తిక్క, హీరో అడివి శేష్, నిర్మాత మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పింది.

మిస్ ఇండియా పోటీల్లో సెకెండ్ రన్నరప్ గా నిలిచిన శోభిత.. అనురాగ్ కశ్యప్ తీసిన హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైంది. తర్వాత ”గూఢచారి” సినిమాతో తెలుగులోకి, ఆ మరుసటి ఏడాది మలయాళంలోకి ఎంటరైంది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో కూడా రాణిస్తోంది.

Related Stories