సీతగా ఈ భామ వద్దు!

Kiara

ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాన్నాళ్ల కిందటే చర్చ మొదలైంది. సౌత్ మీడియా కీర్తిసురేష్ పేరును, నార్త్ మీడియా కియరా అద్వానీ పేరును హైలెట్ చేశాయి. కొన్ని రోజులు గడిచేసరికి, ఎక్కువమంది కియరా అద్వానీకే ఫిక్స్ అయ్యారు. మేకర్స్ కూడా కియరా వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు బాలీవుడ్ మీడియా తేల్చేసింది.

ఇదంతా పక్కనపెడితే.. ‘ఆదిపురుష్’కు కియరా ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ మొదలైంది. ఎందుకంటే..’ఆదిపురుష్’లో ప్రభాస్ ది రాముడి పాత్ర. సో.. ఆటోమేటిగ్గా కియరాది సీత పాత్ర. ఇలాంటి మహోన్నతమైన పాత్రను కియరాకు అప్పగించడంపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దీనికి ఓ కారణం ఉంది.

గతంలో ‘లస్ట్ స్టోరీస్’ అనే సిరీస్ చేసింది కియరా. అందులో స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో కనిపించింది. ఆ సన్నివేశాలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఓవర్ నైట్ లో కియరాను స్టార్ ను చేశాయి. అలాంటి అమ్మాయితో ఎంతో ఔన్నత్యం కలిగిన సీత పాత్రను చేయించడం కరెక్ట్ కాదంటోంది సోషల్ మీడియా.

కానీ పాత్రకి తగ్గట్లు నటించడమే హీరో, హీరోయిన్ల పని. రాముడుగా నటించిన ఎన్టీఆర్, డ్రైవర్ రాముడిగా కూడా కనిపించాడు. సో.. కియారని సీత పాత్ర చెయ్యొద్దు అనడం కరెక్ట్ కాదు.

Related Stories