ప్ర‌శ్నించే ‘సన్నాఫ్ ఇండియా’

- Advertisement -

సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల విడుదల కానుంది. డైలాగ్ రైటర్ డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు.

“నాలుగు ఫైట్లు ఐదు సాంగ్స్ ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజ్ రూపంలో వెళ్ళ‌కుండా ఓ ప్ర‌యోగాత్మ‌క‌మైన చిత్రం చేశాను. ఓటీటీ కోస‌మ‌ని ఈ సినిమాని ప్లాన్ చేశా. కానీ సినిమా మొత్తం పూర్తయిన త‌ర్వాత ఇది థియేటర్లలోనే  చేద్దామన్నారు మోహన్ బాబు గారు. ఆయనకి అంతగా నచ్చింది,” అని చెప్పారు డైమండ్ రత్న బాబు.

“క్లైమాక్స్‌లో పుణ్య‌భూమినాదేశం, రాయ‌ల‌సీమ‌రామ‌న్న‌చౌద‌రి లాంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉంటాయి. మోహ‌న్‌బాబు పాత్ర‌కి చిరంజీవిగారు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళ‌య‌రాజా లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకి ప‌ని చేయ‌డం మరో అదృష్టం,” అన్ని అన్నారు దర్శకుడు.

‘సన్ ఆఫ్ ఇండియా’ నిడివి కేవ‌లం ఒక గంట 30 నిమిషాలు మాత్ర‌మేనట.

“ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు పాత్ర పేరు విరుపాక్ష‌. అలా అని దేశ‌భ‌క్తి చిత్రం కాదు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లొసుగులు గురించి ప్ర‌శ్నించే విధంగా విరూపాక్ష పాత్ర ఉంటుంది,” అంటూ ముగించారు రత్నబాబు. 

 

More

Related Stories