18న సన్నాఫ్ ఇండియా రాక

- Advertisement -


సీనియర్ హీరో మోహన్ బాబు కూడా ఫిబ్రవరి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఆయన చాలా గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం… ‘సన్నాఫ్ ఇండియా’. ఈ సినిమా ఈ నెల 18న్ల విడుదల కానుంది. ఈ డేట్ ని తాజాగా ప్రకటించారు.

‘సన్నాఫ్ ఇండియా’ పూర్తిగా దేశభక్తితో కూడిన చిత్రం. మోహన్ బాబు ఇందులో రకరకాల గెటప్పులలో కనిపిస్తారు.

డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకుడు. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందివ్వడం మరో ప్రత్యేకత.

సమకాలీన రాజకీయ అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో మోహన్ బాబు నటనే మెయిన్ హైలైటుగా నిలుస్తుందట. డైలాగ్ కింగ్ డైలాగ్ లు వివాదాన్ని రేపే విధంగా పేలుతాయట.

 

More

Related Stories