ఆ ఆలోచన ఉంది: సోనూ సూద్

Sonu Sood

లాక్ డౌన్ టైమ్ లో తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సోనూ సూద్. ఇక ప్రజల దృష్టిలో విలన్ కాస్తా హీరో అయిపోయాడు. ఈ సేవా కార్యక్రమాల ఆధారంగా త్వరలోనే సోనూసూద్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేస్తున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై తాజాగా రెస్పాండ్ అయ్యాడు సోనూ.

ప్రస్తుతం తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్న సోనూ సూద్, వీలైతే భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వస్తానంటున్నాడు. అయితే అలా జరగడానికి ఐదేళ్లు లేదా ఆరేళ్లు టైమ్ పట్టొచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికైతే తన దృష్టి మొత్తం సినిమాలు-ఛారిటీపైనే ఉందని ప్రకటించాడు.

మొత్తమ్మీద భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశమైతే ఉందని పరోక్షంగా ఒప్పుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం తెలుగులో “అల్లుడు అదుర్స్” సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో కూడా బోలెడన్ని సినిమాలున్నాయి.

ఐతే, ఈ మధ్య పారితోషికం పెంచాడు సోనూ. దాంతో నిర్మాతలు ఆయన్ని అప్రోచ్ అవ్వాలంటే జంకుతున్నారు.

Related Stories