విలన్ గా వచ్చాడు.. హీరో అయ్యాడు

Sonu Sood Gets Grand Welcome to the sets of Alludu Adhurs

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కొత్త సినిమా “అల్లుడు అదుర్స్” సెట్స్ పైకొచ్చింది. అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. ఇందులో కొత్తేం ఉందని అనుకోవద్దు. ఈ సినిమా సెట్స్ పైకి సోనూసూద్ వచ్చాడు. అదే విశేషం.

లాక్ డౌన్ కు ముందు వరకు సోనూసూద్ అంటే టాలీవుడ్ విలన్. కానీ ఇప్పుడతడు ఆలిండియా లెవెల్లో హీరో. లాక్ డౌన్ టైమ్ లో సోనూ చేసిన సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సొంత ఖర్చుతో లక్షలాది మందికి సహాయం చేశాడు సోనూ భాయ్. దేశమంతా మెచ్చుకునేలా, అందరూ గర్వపడేలా ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించాడు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు. సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దీంతో “అల్లుడు అదుర్స్” యూనిట్ చిన్నపాటి సెలబ్రేషన్ చేసింది. సెట్స్ లోనే ఉన్న ప్రకాష్ రాజ్, అతడికి సన్మానం చేశాడు. బ్రహ్మాజీ లాంటి నటులు వ్యక్తిగతంగా అభినందించారు. అలా విలన్ పాత్ర చేయడానికొచ్చిన సోనూ.. సెట్స్ లో హీరోగా మారాడు. సినిమా రిలీజ్ టైమ్ కు బెల్లంకొండతో పాటు సోనూకు కటౌట్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related Stories