ఆచార్య టీంకి సోను సూద్ గిఫ్ట్స్

Sonu Sood

సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు తన దాతృత్వంతో. ఇప్పటికే దేశంలో ఎందరికో ఎన్నో విధాలుగా సాయం అందించాడు. సోను సూద్ కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ వేరు. ఇంత పేరు వచ్చినా… తన సంపాదనలో చాలా పంచినా… ఆయన చారిటీ ఆగడం లేదు.

తాజాగా తాను నటిస్తున్న ఒక సినిమా టీంకి మొబైల్ ఫోన్లు అందించాడు సోను సూద్ “ఆచార్య” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి వర్క్ చేసిన పేద కళాకారులు, టెక్నిషియన్లకు 100 మొబైల్ ఫోన్లు బహుమతిగా ఇచ్చాడు.

సోను సూద్ ఇప్పటికే తన చారిటీ పనులకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమితాబ్ బచ్చన్ అతన్ని తన కేబీసీ షోకి ‘కరమ్ వీర్’గా పిలిచారు. ఇటీవలే సోను సూద్ ఒక పుస్తకం కూడా పబ్లిష్ చేశాడు. ఈ చారిటీ పనుల కోసమే తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు.

సోను ఇదంతా పొలిటికల్ గోల్ తో చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎవరేమి అనుకున్నా.. విమర్శించినా… సాయం అడిగినవారికి చేస్తూనే ఉంటాను అంటున్నాడు సోను సూద్.

More

Related Stories