మోత మోగుతున్న సోను ఫోన్

Sonu Sood

ప్రభుత్వాలను నమ్ముకోవడం కన్నా సోను సూద్ కి ఫోన్ చేస్తే పని అవుతుందనే నమ్మకం చాలామందిలో ఏర్పడింది. అందుకే ఈ నటుడికి SOS కాల్స్ అధికంగా వస్తున్నాయి.ఈ కరోనా సంక్షోభ సమయంలో సోను సూద్ ఒక మెస్సయ్యగా మారిపోయాడు. సాయం అడిగిన ప్రతివారికి నో చెప్పడం లేదు. తనవల్ల అయ్యే హెల్ప్ తప్పకుండా చేస్తున్నాడు.

గత ఏడాది లాక్డౌన్ పీరియడ్ లో గొప్ప సేవ చేశాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా టైంలోనూ సోను సూద్ ఫోను రింగ్ అవుతూనే ఉంది.

నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉంది, ఆసుపత్రిలో బెడ్స్ దొరకడం లేదు. ఇక మందులు మాత్రం దేశమంతా కొరత ఉంది.దాంతో వీటిని ప్రొవైడ్ చెయ్యాలంటూ సోను సూద్ కి కాల్స్, మెసెజ్ లు వస్తున్నాయి. తన ఫోన్ ఎలా మోగుతుందో చూపిస్తూ దాని వీడియోని పోస్ట్ చేశాడు సోను.

సోను సూద్ కూడా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు. అయినా కూడా, తన సాయం అందించే పనుల్లో అలుపు లేదు.

More

Related Stories