నేను మధ్యవర్తినే: సోను సూద్

Sonu Sood


సోను సూద్ వేల మందికి ఎలా సాయం చేస్తున్నారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? డబ్బు విషయం పక్కన పెడితే, ఎవరికీ దొరకని మందులు, వైద్య పరికరాలు సోను సూద్ టీంకి ఎలా దక్కాయి? దీని వెనుక ఉన్న గూడపుఠాణి ఏంటి?

ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు సోను సూద్. బొంబాయి హైకోర్టు అడిగిన ఈ ప్రశ్నలకు జవాబులను అఫడవిట్ రూపంలో సమర్పించారు. డబ్బుల విషయంలో సరైన సమాధానం ఇవ్వలేకపోయారు సోను. ఐతే, మిగతా విషయాల్లో మాత్రం తనకు పలు స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, అధికారులు, సామాజిక సేవా దృక్పథం ఉన్నవాళ్లు సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు సోను సూద్.

తాను గానీ తన టీం గానీ మందులను దారి మళ్లించి కృత్రిమ కొరత సృష్టించలేదని చెప్పారు సోను సూద్. ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అవసరం ఉందని తమని సంప్రదించిన వారికి, అధికారులకు మధ్య తాను కేవలం మధ్యవర్తిగానే వ్యవహరించానని చెప్పుకొచ్చారు సోను సూద్. ఈ కేసును బాంబే హైకోర్టు మరోసారి వాయిదా వేసింది.

దేశంలో కొన్ని వేల మందికి ఈ కరోనా కాలంలో సాయం చేశారు సోను సూద్. ఐతే, ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇంకొన్ని అనుమానాలున్నాయి అని కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి.

Advertisement
 

More

Related Stories