సోనుసూద్ కి నెగెటివ్ వచ్చింది

Sonu Sood

గత వారం కరోనా బారిన పడ్డ సోనుసూద్ కోలుకున్నాడు. స్వల్ప లక్షణాలతో కరోనా వచ్చింది దాంతో వెంటనే కోలుకున్నాడు. తాజా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ తో తెలిపాడు.

‘ఆచార్య’ సినిమాకి చెందిన గ్రూప్ సాంగ్ షూటింగ్ తీస్తుండగా అతనికి కరోనా సోకింది. ఈ సినిమాలో సోనుసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతేడాది లాక్డౌన్ టైంలో వలస కార్మికులకు సోనుసూద్ చేసిన సహాయం గొప్పది. ఇప్పుడు సెకండ్ వేవ్ కేసుల సందర్భంగా కూడా తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు.

ఆక్సిజన్ సిలండర్లు ఆరెంజ్ చెయ్యడం, ఆసుపత్రిలో బెడ్స్ దక్కేలా చూడడం వంటివి చేస్తున్నాడు.

More

Related Stories