థియేటర్లకు గైడ్ లైన్స్ ఇవే

ఈనెల 15 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (SOP)లో భాగంగా 24 గైడ్ లైన్స్ ను జారీచేసింది. ప్రతి థియేటర్లలో వీటిని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

– ఆడిటోరియంలో ఆక్యుపెన్సీ 50శాతానికి మించకూడదు
– సీటింగ్ లో తగినంత భౌతిక దూరం పాటించాలి
– కేటాయించని సీట్లపై క్రాస్ మార్కింగ్ వేయాలి
– హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి
– ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించాలి
– ఎంట్రెన్స్ లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేయాలి
– ఆరోగ్యంపై స్వీయ పరిశీలన ఉండాలి.. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే చెప్పాలి
– ఒక్కో స్క్రీన్ కు ఒక్కో టైమింగ్ ఫాలో అవ్వాలి
– పేమెంట్స్ లో డిజిటల్ మోడ్ ను ప్రోత్సహించాలి
– బాక్సాఫీస్ తో పాటు అన్ని ఏరియాల్ని తరచుగా శుభ్రం చేయాలి
– బాక్సాఫీస్ వద్ద కౌంటర్ల సంఖ్య పెంచాలి
– ఇంటర్వెల్స్ లో మూకుమ్మడిగా వెళ్లడం మానుకోవాలి
– బాక్సాఫీస్ వద్ద ఫ్లోర్ మార్కింగ్ వేయాలి (భౌతిక దూరం కోసం)
– రోజంతా బాక్సాఫీస్ ఓపెన్ చేయాలి.. అడ్వాన్స్ బుకింగ్ ను ప్రోత్సహించాలి
– ఉమ్మి వేయడాన్ని కఠినంగా నియంత్రించాలి
– శ్వాసకోస సంబంధిత ఏర్పాట్లన్నీ పాటించాలి
– ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్స్ మాత్రమే అనుమతించాలి. హాల్ లోపల డెలివరీ చేయకూడదు
– స్నాక్స్ కోసం మరిన్ని కౌంటర్లు ఏర్పాటుచేయాలి
– హాల్ శుభ్రపరిచే సిబ్బంది కోసం మాస్కులు, గ్లౌజులు, బూట్లు అందుబాటులో ఉంచాలి
– అందరి దగ్గర్నుంచి కచ్చితంగా మొబైల్ నంబర్ తీసుకోవాలి.  (కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం)
– బాక్సాఫీస్ వద్ద తగినన్ని కౌంటర్లు ఓపెన్ చేయాలి
– కరోనా వైరస్ ను ప్రోత్సహించే ఎలాంటి చర్యనైనా సెక్యూరిటీ సిబ్బందితో అడ్డుకోవాలి
– అన్ని థియేటర్లలో ఉష్ణోగ్రతను 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య మాత్రమే మెయింటైన్ చేయాలి
– భౌతిక దూరం, మాస్కులు, వ్యక్తిగత శుభ్రతపై పబ్లిక్ ఎనౌన్స్ మెంట్స్ ఇవ్వాలి

Related Stories