- Advertisement -

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు ఆయనకు టెస్టులో నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న బాలు, చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని గత నెలలో ఆయన స్వయంగా వెల్లడించారు.
టెస్టుల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ బాలసుబ్రమణ్యంకు లైఫ్ సపోర్ట్ మాత్రం అందిస్తూనే ఉన్నారు వైద్యులు. ఎందుకంటే వైరస్ బారిన పడిన ఆయన ఊపిరితిత్తులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరికొన్ని రోజులు ఆయనకు వెంటిలేటర్ అవసరమని వైద్యులు సూచించారు.
ప్రస్తుతం బాలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించాడు. తన ఐపాడ్ లో బాలు, క్రికెట్-టెన్నిస్ చూస్తున్నారని.. అందర్నీ గుర్తుపడుతున్నారని చరణ్ వెల్లడించాడు.