- Advertisement -
ఈ లోకాన్ని వీడి అందర్నీ బాధలోకి నెట్టారు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈరోజు మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. కొన్ని రోజులుగా వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలు ఈ లోకాన్ని వీడారు.
కన్నుమూయడానికి కొన్ని రోజుల ముందు బాలుపై తీసిన ఓ వీడియో, హాస్పిటల్ లో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలుకు సంబంధించి ఇవే చివరి వీడియోలు, ఫొటోలు.
ఈ వీడియోలో, ఫిజియో థెరపీలో భాగంగా బాలుకు ఓ చిన్నపాటి పెడల్ ఉన్న పరికరం ఇచ్చి తిప్పమన్నారు వైద్యులు. దాన్ని బాలు తిప్పారు. దీంతో డాక్టర్స్ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఎక్కువ సేపు బాలు అలా పెడల్ ను తిప్పలేకపోయారు. ఇక బాలును వెనక వైపు నుంచి వైద్యులు పరీక్షిస్తున్న ఫొటోలు కూడా బయటకొచ్చాయి.