అన్నయ్య పరిస్థితి మెరుగైంది: శైలజ

sailaja spb

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇప్పటికి “లైఫ్ సప్పోర్ట్”తోనే ఉన్నారు అని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్ లో ప్రకటించింది. ఐతే, ఆయన సోదరి మాత్రం బాలు అభిమానులకు ఊరటనిచ్చే మాట చెప్పారు.

“రోజురోజుకి బెటర్ అవుతున్నారు. డాక్టర్స్ అర్ వెరీ హ్యాపీ. అన్నయ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగు అయింది. ప్రస్తుతం వెంటిలేటర్ తొలగించారు. కానీ స్పృహలోకి వస్తున్నారు. యూరిన్ వ్యవస్థ కూడా నార్మల్ లోకి వచ్చింది,” అని ఒక ఆడియో మెసేజ్ పంపారు శైలజ. “అన్నయ్య మళ్లీ మాములుగా మనందరి ముందుకు వస్తారు. మీ అందరి ప్రార్థనలు చేస్తున్నారు అని తెలుసు. థాంక్యూ సో మచ్.”

బాలసుబ్రమణ్యం ఈ నెల 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చేరారు. ఐతే వారం రోజుల తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. ఈనెల 13న ఐసీయూలోకి తరలించారు. ఒక దశలో ఆయన పరిస్థితి చాలా విషమంగా మారింది. అయితే, తమిళనాడు ప్రభుతం వేగంగా స్పందించి… చెన్నైలోని బెస్ట్ డాక్టర్ల సప్పోర్ట్ అందించింది. వైద్యుల శ్రమతో బాలు ఇప్పుడు కోలుకుంటున్నారు.

Related Stories