బాలు పాడిన లాస్ట్ సాంగ్?

SP Balu

మరణానంతరం ఎస్పీ బాలసుబ్రమణ్యానికి సంబంధించి పలు వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుంచి ఎలాంటి రిప్రజంటేషన్ జరగలేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బాలు ఆస్పత్రి బిల్లులపై కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే సమసిపోతున్న టైమ్ లో మరో వివాదం రాజుకుంది.

బాలు తెలుగులో పాడిన ఆఖరి పాట ఏది? ఇప్పుడీ అంశం చుట్టూ వివాదం ముసురుకుంటోంది.

“పలాస” అనే సినిమా కోసం బాలు ఓ పాట పాడారు. అదే చివరి పాట అంటున్నాడు మ్యూజిక్ డైరక్టర్ రఘు కుంచె. అయితే అది ఆఖరి పాట కాదని, “చీమ-ప్రేమ మధ్యలో భామ” అనే సినిమా కోసం బాలు ఓ పాట పాడారని, తెలుగులో ఆయనకు అదే ఆఖరి పాట అని ఆ సినిమా మేకర్స్ వాదిస్తున్నారు. ఈ మేరకు వాళ్లు బాలుకు సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

అటు తమిళ్ లో మాత్రం ఇలాంటి వివాదం లేదు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న “అన్నాత్తై” సినిమాలో ఇంట్రో సాంగ్ పాడారు బాలు. తమిళ్ లో ఆయన పాడిన చివరి పాట అదే.

Related Stories