నిహారిక పెళ్లిలో కట్నకానుకలు ఇవే?

సెలబ్రిటీ పెళ్లిళ్లలో కట్నకానుకలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే అవి పూర్తిగా ఆ రెండు కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. బయటకొచ్చేవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. నిహారిక పెళ్లికి సంబంధించి కూడా కట్నకానుకలపై అలాంటి ఊహాగానాలే జోరుగా నడుస్తున్నాయి.

ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం.. నిహారిక పెళ్లికి, నాగబాబు లాంఛనాల కింద దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చుకున్నారట. వీటితో పాటు నిహారికకు 2 కోట్ల రూపాయల బంగారం కూడా పెడుతున్నారట. ఇవి మాత్రమే కాకుండా.. హైదరాబాద్ లో నిహారిక పేరిట ఉన్న ఇంటిని కూడా అల్లుడికి ఇచ్చేస్తున్నారట.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. గతంలో ఎన్టీఆర్ పెళ్లి జరిగినప్పుడు, రామ్ చరణ్, ఉపాసనను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కట్నకానుకలపై ఇలానే చాలా ఊహాగానాలు వినిపించాయి. ఇది కూడా అలాంటిదే.

వచ్చేనెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక-చైతన్య పెళ్లి జరగనుంది. ప్రస్తుతం నిహారిక అక్కడే ఉంది.

Related Stories