
పవన్ కళ్యాణ్ బర్త్ డేకి కౌంట్ డౌన్ షురూ అయింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. దాంతో, రకరకాల ఊహాగానాలు మొదలు అయ్యాయి. క్రిష్ సినిమా ఆగిపోయిందని, మరో రీమేక్ సినిమా ఒప్పుకున్నాడు అని ఇలా చాలా వార్తలు బయటికి వచ్చాయి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న చిత్రాల లిస్ట్ కూడా పెద్దదే.
“వకీల్ సాబ్” సినిమాతో పాటు క్రిష్, పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. దానికి తోడు, హరీష్ శంకర్ సినిమా ఇప్పటికే ప్రకటించారు. హరీష్ … ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తూ మరో ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. ఈ గ్యాప్ లో క్రిష్ సినిమా ఆగిపోయి, మరో మళయాలం రీమేక్ ఒప్పుకున్నాడు అంటూ కథనాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ టీం మాత్రం ఇందులో నిజం లేదంటోంది.
ఆఫిసియల్ గా ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తే… క్లారిటీ వస్తుందేమో.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. నవంబర్లో ఇది ముగుస్తుంది. అప్పటివరకు షూటింగ్ సెట్ వైపు చూపు వెయ్యరు పవన్ కళ్యణ్. ఆ తర్వాతే “వకీల్ సాబ్” షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ సినిమా ముచ్చట అయినా…