తెలుగులో స్రవంతి ‘దీపావళి’

- Advertisement -

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. తెలుగులో దీని పేరు ‘దీపావళి’.

దీపావళి’లో ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే, అందమైన ప్రేమకథ కూడా ఉంది. ‘దిల్’ రాజు ఏ విధంగా అయితే ‘బలగం’ తీశారో… ఆ తరహాలో మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’.

‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడి ద్వారా ఐదు నిమిషాల పాటు ఈ సినిమా కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. దర్శకుడిని కథ మొత్తం రికార్డ్ చేసి పంపమని అడిగా. కథ నచ్చడంతో ఓకే చేశా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం ” అని అన్నారు.

 

More

Related Stories