అల్లూరిగా శ్రీ విష్ణు

- Advertisement -

“ఆర్ ఆర్ ఆర్” సినిమా వల్ల అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పేర్లు కమర్షియల్ సెల్లింగ్ పాయింట్స్ గా మారిపోయాయి. అందుకే, ఒక కొత్త సినిమాకి ‘అల్లూరి’ అనే పేరు వచ్చింది.

యువ హీరో శ్రీ విష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న మూవీకి ‘అల్లూరి’ అనే పేరు ఖరారు చేశారు. ప్రదీప్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ ఈ రోజు విడుదల అయింది. హీరో రవితేజ ఆ పోస్టర్ ని లాంచ్ చేశారు.

“ఆర్ ఆర్ ఆర్” సినిమాలో రామ్ చరణ్ పోషించిన పాత్ర అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారి వద్ద అల్లూరి సీతారామరాజు పొలీసు అధికారిగా పనిచేశారని రాజమౌళి ఊహించారు. ఆ పాత్రని మలిచిన తీరు పాపులర్ అయింది. దాంతో శ్రీవిష్ణు పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ సినిమాకి “అల్లూరి” టైటిల్ పెట్టారు.

బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. హీరోయిన్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు.

 

More

Related Stories