శ్రీవిష్ణు పంథా మారుస్తున్నాడా?

మంచి టాలెంట్ ఉన్న యువ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. ఎవరి అండ లేకుండా సొంత టాలెంట్ తో పైకి వస్తున్న శ్రీవిష్ణు ‘బ్రోచేవారెవరురా’, ‘రాజా రాజా చోర’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేశాడు. ఐతే, ఇటీవల ఆయన ఒప్పుకున్న చిత్రాలు తేడా కొట్టాయి. అవే ‘గాలి సంపత్’, ‘అర్జున ఫల్గుణ’.

రెండూ దారుణ పరాజయం పాలు అయ్యాయి. అంతే కాదు, మంచి సినిమాలు చేస్తాడన్న శ్రీవిష్ణు పేరుకి బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి. శ్రీవిష్ణు ఇక తన పంథా మార్చాల్సిన టైం వచ్చింది అని కామెంట్స్ వచ్చాయి.

ఈ ఏడాది ‘భళా తందనాన’ అనే సినిమాతో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. చైతన్య దంతులూరి తీస్తున్న ఈ మూవీలో శ్రీ విష్ణు కార్పోరేట్ లుక్ లో స్టయిల్ గా ఉన్నాడు.

చూస్తుంటే శ్రీవిష్ణు తన ఆలోచన శైలి మార్చుకున్నట్లు ఉంది. మంచి కథల ఎంపికపై ఫోకస్ పెడుతున్నట్లుంది.

 

More

Related Stories