- Advertisement -

‘బ్రోచేవారెవరురా’, ‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ వంటి సినిమాలతో హీరోగా నిలబడ్డ శ్రీవిష్ణు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మిగతా హీరోల బాటలోనే టకా టకా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం సెట్స్ పై ‘రాజ రాజ చోళ’, ‘గాలి సంపత్’ చిత్రలున్నాయి. అలాగే, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఒక మూవీ కూడా ఇటీవలే లాంచ్ అయింది. లేటెస్ట్‌గా, మరో సినిమాకి శ్రీవిష్ణు అంగీకారం తెలిపారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించనున్నారు. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
అంటే, శ్రీవిష్ణు చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. ఒక్కసారిగా ఈ హీరో అంత బిజీ అయిపోయాడు.