‘అర్జున ఫల్గుణ’ ఫ్రెష్ గా ఉంటుంది!

- Advertisement -

ఈ ఏడాది ‘రాజ రాజ చోర’తో ప్రశంసలు అందుకున్నారు హీరో శ్రీ విష్ణు. మంచి విజయం కూడా తన ఖాతాలో పడింది. ఇక 2021కి గుడ్ చెప్తూ ఆయన కొత్త సినిమా థియేటర్లల్లోకి రానుంది. అదే… అర్జున ఫ‌ల్గుణ‌.

అర్జున ఫల్గుణ గురించి…

2021లో ఇంతకుముందే రెండు సినిమాలు రిలీజ్ చేశాను. ‘అర్జున ఫల్గుణ’ మూడోది. దర్శకుడు తేజ మార్ని మొదటి మూవీగా తీసిన ‘జోహార్’ నచ్చింది. నాకు కథ చెప్పినప్పుడు ఇంకా ‘జోహార్’ ఇంకా విడుదల కాలేదు. కానీ గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. తేజ మా బ్యాక్ డ్రాప్ లో చెప్పిన కథ ఫ్రెష్‌గా అనిపించింది. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ.

ఈ కథలో ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు తేజ ‘అర్జున ఫల్గుణ’ అని అంటే ధైర్యం వస్తుందనేది మన వారి నమ్మకం. ఆ పేరులో ఆ వైబ్రేషన్స్ ఈ కథలో ఉంటాయి. ముందు అనుకున్న టైటిల్ ఇది కాదు. ఫైనల్ గా ఈ టైటిల్ కథకి కరెక్ట్ అనిపించింది.

గ్రామ వాలంటీర్ల వివాదం

గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా చూపలేదు ఈ సినిమాలో. సినిమాలో అలా ఏమి ఉండదు. గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. అంతకుమించి ఇందులో వివాదాస్పద కామెంట్స్ లేవు.

ఎన్టీఆర్ కి ఫ్యాన్ గా

అవును, ఎన్టీఆర్ కి ఫ్యాన్ గా నటించాను. అందరి హీరోలని ఇష్టపడతాను. కానీ సినిమాలో ఎన్టీఆర్ కి అభిమానిగా నటించాను.

నేచురల్ గా ఉండే చిత్రాలే చేస్తా!

కెరీర్ లో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. కానీ రియలిస్టిక్ సినిమాలు, కొత్తగా చెప్పే కథనాలతో కూడిన సినిమాలు చేశాను. అవే నా బలం.

 

More

Related Stories