తన ‘స్వాగ్’ చూపించనున్న శ్రీవిష్ణు

Sree Vishnu

స్టయిల్ అంటే అందరికీ తెలుసు. ఐతే, స్టయిల్ లాంటి అర్థం వచ్చే స్వాగ్ (Swag) అనే పదం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. రజినీకాంత్ స్వాగ్ మరెవ్వరికీ రాదు అంటే ఆయన స్టయిల్ ఇంకొకరికి అర్థం. ఇప్పుడు యువ హీరో శ్రీవిష్ణు కూడా తన స్వాగ్ చూపించనున్నాడు.

శ్రీవిష్ణు ఇటీవలే ‘సామాజవరాగమన’ చిత్ర్రంతో మంచి విజయం అందుకున్నాడు. కొన్ని ఫ్లాపుల తర్వాత వచ్చిన విజయం అది. దాంతో ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో ధీమాగా ఉన్నాడు. అన్నట్లు, తన కొత్త చిత్రానికి “స్వాగ్” అనే పేరు పెట్టుకున్నాడట.

తాజాగా పవన్ కళ్యాణ్ తో “బ్రో” వంటి సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకుడు. ఈ డైరెక్టర్ ఇంతకుముందు శ్రీవిష్ణుతోనే “రాజరాజ చోర” అనే హిట్ సినిమాని తీశాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రానికి “స్వాగ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

ఈ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. సో, త్వరలోనే టైటిల్ ప్రకటిస్తారు.

Advertisement
 

More

Related Stories