జీగ్రూప్ చేతికి శ్రీవిష్ణు మూవీ

మహేష్, చిరంజీవి, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాల రైట్స్ రిలీజ్ కు ముందే అమ్ముడుపోతాయి. మరీ ముఖ్యంగా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్ డీల్స్ లాక్ అయిపోతుంటాయి. ”పుష్ప”, ”ఆచార్య”, ”సర్కారువారి పాట” సినిమాల శాటిలైట్ రైట్స్ కోసం ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయి. రేపోమాపో డీల్స్ క్లోజ్ అవుతాయి. మరి శ్రీవిష్ణు సినిమా కూడా ఇలా రిలీజ్ కు ముందే అమ్ముడుపోతే ఎలా ఉంటుంది?

అవును.. శ్రీవిష్ణు నటిస్తున్న ”రాజరాజచోర” అనే సినిమా విడుదలకు ముందే అమ్ముడుపోయింది. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ రైట్స్ డీల్ క్లోజ్ అవ్వడానికి ఓ కారణం ఉంది.

రీసెంట్ గా మూవీ బిజినెస్ లోకి ఎంటరైంది జీ గ్రూప్. సినిమాల సర్వహక్కుల్ని దక్కించుకునే కార్యక్రమం షురూ చేసింది. ఇందులో భాగంగా సాయితేజ్ నటించిన ”సోలో బ్రతుకే సో బెటర్” రైట్స్ దక్కించుకున్న ఈ సంస్థ.. శ్రీవిష్ణు సినిమా రైట్స్ ను కూడా ఇలానే గంపగుత్తగా దక్కించుకుంది. వీలైతే థియేటర్లలో రిలీజ్ చేస్తుంది, లేకపోతే ఓటీటీలో విడుదల చేస్తుందన్నమాట.

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. మరికొన్ని రోజుల్లో టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. హసిత్ గోలి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related Stories