- Advertisement -

మాస్ మహారాజ రవితేజ ఇటీవల యంగ్ హీరోయిన్లతో జత కడుతున్నాడు. “ఖిలాడి”లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలతో నటించాడు. తాజాగా “ధమాకా” సినిమాలో తెలుగు భామ శ్రీలీలతో డ్యూయెట్లు పాడుతున్నడు.
“పెళ్లి సందD” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొంది శ్రీలీల. ఆ సినిమాలో ఆమె అందచందాలు మాస్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఏకంగా రవితేజలాంటి మాస్ మహారాజ సరసన నటిస్తోంది. సో ఆమె కెరీర్ కిది బూస్టప్.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర పేరు ప్రణవి. ఈ పోస్టర్‌లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల క్యూట్‌గా కనిపిస్తోంది. మరోవైపు, ఈ భామ అప్పుడే 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట.
ప్రస్తుతం ఆమె ఖాతాలో నాలుగు చిత్రాలున్నాయి మరి.