శ్రీలీలకు ఆఫర్లే ఆఫర్లు


కొందరికి అదృష్టం బబుల్ గమ్ లా పట్టుకుంటుంది. ఒక్క సినిమాతోనే అనేక చిత్రాలు పొందిన బ్యూటీ శ్రీలీలని చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పటికే రవితేజ సరసన ‘ధమాకా’ వంటి పెద్ద సినిమాలో ఛాన్స్ పొందిన ఈ సుందరికి ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చిందిట.

త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న సినిమాలో ఆమని రెండో హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటించనుంది.

త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చాయి. ఈ మూడో సినిమా ఈ సెప్టెంబర్ లో మొదలైంది. 5 రోజుల పాటు షూటింగ్ చేసిన తర్వాత సినిమాని తాత్కాలికంగా ఆపారు. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి చనిపోవడం, ఇటీవల తండ్రి కృష్ణ కన్నుమూయడంతో మళ్ళీ షూటింగ్ మొదలు కాలేదు. ఇక ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ పాత కథని చాలావరకు మార్చేశారట. ఇప్పుడు ఫ్రెష్ స్క్రిప్ట్ గా మారిందట.

కథలో మార్పులు జరగడంతో రెండో హీరోయిన్ కి చోటు దక్కింది. అలా శ్రీలీలకి ఇంత పెద్ద అఫర్ వచ్చింది.

ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ‘ధమాకా’లో నటిస్తోంది. ఈ సినిమా వచ్చేనెల విడుదల కానుంది. అలాగే, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు మొదటి సినిమాలో నటిస్తోంది. బాలకృష్ణ – అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య కూతురి పాత్ర పోషించనుంది. నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో కూడా ఈ భామే హీరోయిన్. బోయపాటి – రామ్ సినిమలో కూడా శ్రీలీల హీరోయిన్. చేతిలో ఇన్ని సినిమాలున్నాయి.

 

More

Related Stories