ఆ అపజయంతో శ్రీలీలకి పెరిగిన క్రేజ్

Sreeleela

రవితేజ పెద్ద హీరో. ఇప్పటికీ భారీ హిట్లు ఇవ్వగల సత్తా ఉంది మాస్ మహారాజాలో. కానీ, ఆయనకి కథల సమస్య వచ్చి పడింది. ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు కొంతకాలంగా.  ‘ధమాకా’ సినిమాతో భారీ విజయం అందుకున్న మాట నిజమే కానీ ఆ ఆనందం ఇప్పుడు ఆవిరైపోయింది. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో రవితేజ అతిథి పాత్ర పోషించడం, అది పెద్ద హిట్ కావడంతో రవితేజ సక్సెస్ గ్రాఫ్ పెరిగినట్లయింది. ‘వాల్తేర్ వీరయ్య’ పక్కన పెడితే సోలో హీరోగా ఆయనకి ఇటీవల కాలంలో దక్కిన పెద్ద హిట్ ‘ధమాకా’నే.

అంత పెద్ద హిట్ తర్వాత రవితేజ సినిమా వస్తోందంటే భారీ ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్ చెయ్యడం సహజం. కానీ, ‘రావణాసుర’ అందరికీ షాక్ ఇచ్చింది. చూసిన ప్రేక్షకులకు నచ్చలేదు. తీసిన నిర్మాతకు సరైన ఓపెనింగ్ దక్కక డీలాపడ్డారు. రవితేజ కూడా ఇలా షాక్ తిన్నారు. ఈ సినిమాలో ఐదుగురు భామలు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల నయాపైసా ఉపయోగం కలగలేదు.

దాంతో, ‘ధమాకా’ సినిమా విజయానికి శ్రీలీల కూడా ఒక మెయిన్ రీజన్ అనే వాదన మొదలైంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఇలాంటి టాఫిక్ షురూ అయింది.

‘రావణాసుర’ సరిగా ఓపెనింగ్ తెచ్చుకోకపోవడం వల్ల శ్రీలీలకి క్రేజ్ పెరగడం విశేషం. ఆమెకి జనంలో బాగా క్రేజ్ ఉందని అర్థమవుతోంది. 

 

More

Related Stories