బడా ఆఫర్లతో శ్రీలీల జోరు


ఒక హీరోయిన్ సడెన్ గా ఎందుకు సక్సెస్ అవుతుందో? ఫిలింమేకర్లు అందరూ ఆమెకే అన్ని ఆఫర్లు ఎందుకు ఇస్తారో కొన్నిసార్లు అర్థం కాదు. రీజనింగ్ కి పట్టని ఎన్నో వింతలూ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి బంపర్ పొజిషన్ లో ఉంది శ్రీలీల.

ఆమె ఏమైనా బ్రహ్మాండం బద్దలైన సినిమాలో నటించిందా అంటే లేదు. కానీ ఆమె నటించిన రెండు తెలుగు సినిమాలు మంచి హిట్ కావడం, ఆమె డ్యాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయినట్లు కనిపిస్తుండడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆమె వెంట పడుతోంది. వరుసగా బడా ఆఫర్లు ఇస్తోంది.

ఇదీ చదవండి: మమ్మల్ని ఆంటీ అని పిలిచేవారు.. వాళ్లనెందుకు అంకుల్ అనరు..!

పూజ హెగ్డే, రష్మిక, సమంత వంటి పెద్ద హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి మరి. ఇప్పటికే ఈ భామ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ ఉందని మీడియా టాక్. ఇవి నిజంగా వర్క్ అవుట్ అయితే ఆమె దశ తిరిగిపోతుంది.

అచ్చ ఆంధ్ర అమ్మాయి శ్రీలీల. కాకపోతే పెరిగింది అంతా కర్ణాటకలో. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న ఈ భామ ఇక చదువు మానేసి ఈ కెరీర్ మేనేజ్ చేసుకుంటే చాలు డబ్బులే డబ్బులు.

Advertisement
 

More

Related Stories