
ఇప్పుడు శ్రీలీలదే హవా. ఆమె చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. ఇక వచ్చే నెల నుంచి జనవరి వరకు ప్రతి నెలా ఒక ఆమె నటించిన ఒక సినిమా విడుదల కానుంది. పక్కాగా ఈ ఐదు సినిమాల విడుదల తేదీలు వచ్చాయి.
స్కంద
రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి దర్శకుడు. మొదట విడుదల కానున్న మూవీ ఇదే. ఈ సినిమా సెప్టెంబర్ 15న రాక.
భగవంత్ కేసరి
నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీలకి బాబాయ్ గా బాలయ్య నటిస్తున్నారు. అక్టోబర్ 19న విడుదల .
ఆదికేశవ
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఆదికేశవ’ ఆగస్టు నుంచి నవంబర్ కి వాయిదా పడింది. ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఇందులో ఆమె రాయలసీమ పిల్లగా కనిపించనుంది.

ఎక్స్ ట్రా
డిసెంబర్ లో నితిన్ హీరోగా నటిస్తున్న “ఎక్స్ ట్రా” చిత్రం విడుదల కానుంది. నితిన్ తో శ్రీలీల నటిస్తున్న మొదటి మూవీ. ఈ మూవీ డిసెంబర్ 23న విడుదల.
గుంటూరు కారం
సంక్రాంతి కానుకగా రానుంది గుంటూరు కారం. ఆమె కెరీర్ లో ఇదే పెద్ద చిత్రం. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 13న విడుదల చెయ్యాలనేది నిర్మాతల ప్లాన్.
మొత్తమ్మీద ఈ భామ నటించిన ఐదు చిత్రాలు వరుసగా నెలకోటి మన ముందుకు రానున్నాయి.