తగ్గేదేలే అంటున్న మమ్మీ!

- Advertisement -


హీరోయిన్ అన్న తర్వాత డిమాండ్లు ఉంటాయి. కొంచెం క్రేజ్ వస్తే ఇంకా ఎక్కువ సతాయింపులు ఉంటాయి నిర్మాతలకు. ఐతే, హీరోయిన్ల కన్నా వాళ్ళ అమ్మలు, నాన్నలే ఎక్కువ ఇబ్బంది పెడుతారు నిర్మాతలని. ఇది జగమెరిగిన సత్యం.

హీరోయిన్ శ్రీలీల విషయంలో అదే జరుగుతోంది. ‘పెళ్లి సందD’ అనే సినిమాలో నటించి ఒక్కసారిగా నాలుగు ఐదు సినిమాల్లో అవకాశాలు పొందింది ఈ కత్తిలాంటి క్యూటీ. యువ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సరసన ఈ అమ్మడిని తీసుకునేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. దాంతో, ఆమె తల్లి ఒక్కసారిగా టోన్, ట్యూన్ మార్చినట్లు టాక్.

తన కూతురుకి ఇవ్వాల్సిన పారితోషికం విషయంలో ఆమె ఖరాఖండిగా ఉంటున్నారట. ఆమె నటించిన రెండో సినిమా (రవితేజ ‘ధమాకా’) ఇంకా విడుదల కాలేదు. కానీ ఒక్కో నిర్మాతకు ఒక్కో పారితోషికం చెప్తున్నారట. ఆటో మేటర్ కన్నా స్పీడ్ గా పెంచేస్తున్నారని టాక్.

శ్రీలీలని తమ సినిమాల్లో తీసుకోవాలంటే ముందు ఆమె మమ్మీని మెప్పించడం నిర్మాతలకు పెద్ద టాస్క్ లా మారిందని అంటున్నారు.

 

More

Related Stories