శ్రీలీల ముద్దులు హద్దులు!

Sreeleela

శ్రీలీల హవా తగ్గింది. గతేడాది గ్యాప్ లేకుండా నటించిన ఈ భామ ఈ ఏడాది ఇప్పటివరకు కొత్తగా ఒక్క సినిమా ఒప్పుకోలేదు. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గాయి.

మరి యువ హీరోల సరసన సినిమాలు ఒప్పుకోవచ్చు కదా? ఆ విషయంలో ఈ భామకి కొన్ని హద్దులు ఉన్నాయిట. తాజాగా యువ హీరోల చిత్రాల్లో ముద్దుల సన్నివేశాలు ఉంటున్నాయి. ముద్దు సీన్లు చేసేందుకు ఈ భామ ఒప్పుకోదంట. అందుకే, ఈ ముద్దుల హద్దుల వల్లే ఆమె కొత్తగా సినిమాలు ఒప్పుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఉంది.

శ్రీలీల ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సరసన “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా సైన్ చేసింది. కొన్నాళ్ళూ షూటింగ్ కూడా చేసింది. కానీ ఆ సినిమా తాత్కాలికంగా ఆగింది. ఎన్నికల హడావిడి, ఫలితాలు చూశాక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయిస్తారు. అప్పుడు శ్రీలీల ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.

అలాగే, విజయ్ దేవరకొండ సరసన కూడా ఒక సినిమా ఒప్పుకొంది. కానీ ఈ సినిమా నుంచి ఆమెని తప్పించాలనే ఆలోచన చేస్తున్నారు. సో, ఇప్పటికిప్పుడు ఈ భామ చేతిలో ఒక్క సినిమా లేదు.

Advertisement
 

More

Related Stories