శ్రీలీల సక్సెస్ ధమాకా!


ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంటుంది. ఇప్పుడు శ్రీలీల వంతు. ఈ భామ అందం కుర్రకారుని, మాస్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమాతోనే అది ప్రూవ్ అయింది. రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లి సందD’ సినిమాతో అడుగుపెట్టిన ఈ భామ నటించిన రెండో సినిమా ‘ధమాకా’ క్రిస్మస్ కానుకగా శుక్రవారం విడుదలైంది.

సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. క్రిటిక్స్ నుంచి రివ్యూస్ కూడా అలాగే వచ్చాయి. రేటింగ్స్ సాధారణమే. అయినా… సినిమా వసూళ్ల పరంగా స్పీడ్ గా ఉంది. మొదటి వీకెండ్ వసూళ్లు సాలిడ్ గా ఉండేలా ఉన్నాయి.

రవితేజ చాలా రోజుల తర్వాత ఎంటర్ టైనింగ్ పాత్ర చెయ్యడం, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఐతే, అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నది మాత్రం శ్రీలీల అందం గురించి. ఈ 21 ఏళ్ల సుందరి గ్లామర్ సినిమాకి పెద్ద ఆకర్షణగా మారింది. పైగా, డ్యాన్సుల్లో ఇరగదీస్తోంది. అందుకే, ఆమెకి మరోసారి క్రెడిట్ దక్కింది.

ALSO CHECK: Sreeleela at Dhamaka post-release promotions

Dhamaka

శ్రీలీల ప్రస్తుతం నాలుగు పెద్ద చిత్రాల్లో నటిస్తోంది. రామ్ – బోయపాటి చిత్రంలో హీరోయిన్ గా, బాలయ్య కొత్త చిత్రంలో కూతురిగా నటిస్తోంది.

 

More

Related Stories