ఆర్ యూ సీరియస్ శ్రీముఖి?

మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా..
ఏకంగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా..
హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి ఓపెన్ స్టేట్ మెంట్ ఇది. ఆమె సరదాగా అన్నదా లేక సీరియస్ గా అన్నదా అనే విషయాన్ని పక్కనపెడితే.. రెండేళ్లలో పెళ్లి చేసుకొని వెళ్లిపోతా అనే కామెంట్స్ మాత్రం ఆమె ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి.

బుల్లితెర రాములమ్మగా ఏకంగా విజయశాంతితో కూడా శభాష్ అనిపించుకున్న శ్రీముఖి.. స్మాల్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసింది. చిట్టితెరపై అట్టహాసం చేయాలంటే శ్రీముఖిని మించిన యాంకర్ లేదనేది అందరి మాట. మరీ ముఖ్యంగా నాన్-ఫిక్షన్ అల్లరి కార్యక్రమాల్లో శ్రీముఖి సందడి లేకపోతే మజా ఉండదు.

అలాంటి శ్రీముఖి హఠాత్తుగా తన రిటైర్మెంట్ గురించి ప్రకటించడం సంచలనంగా మారింది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ కార్యక్రమంలో శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Related Stories