మూడుముళ్లు… మూడేళ్లు!

హీరోయిన్లు ఎవరైనా ప్రేమలో పడితే పెళ్లి చేసుకుంటారు. లేదా అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు పెళ్లి ఆలోచన చేస్తారు. కానీ హీరోయిన్ కమ్  టీవీ యాంకర్ శ్రీముఖి థాట్స్ వేరుగా ఉన్నాయి. పెళ్లి ఎప్పుడు అంటే… మూడేళ్లు ఆగాలంటోంది. మూడుముళ్లు వేయించుకునేందుకు ఇంకో మూడు ఏళ్ళు పడుతుందట. దానికో లెక్క ఉందని చెప్తోంది.

శ్రీముఖి తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అని టార్గెట్ పెట్టుకుంది. రెండేళ్లు దాటితే 30లోకి అడుగుపెడుతుంది. 30లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాది గ్యాప్ లో పక్కాగా పెళ్లి చేసుకుంటాను అని చెప్తోంది. అంటే ఇంకా మూడేళ్ళ టైం. అది ఆమె లెక్క.

ఐతే, శ్రీముఖి ఒక వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందని చాలాకాలంగా వినిపిస్తోంది. మరి మూడేళ్ళ తర్వాత అతన్నే పెళ్లి చేసుకుంటుందా అన్నది చూడాలి. మరోవైపు ఆమె నటించిన ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమా ఈ వీకెండ్ విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories