జనాన్ని రప్పించలేకపోతున్న శ్రీముఖి

- Advertisement -


శ్రీముఖికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ఆమె పెద్దస్టార్. టీవీ షోలలో అత్యధిక పారితోషికం తీసుకునే భామల్లో ఒకరు శ్రీముఖి. ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ 28 ఏళ్ల బ్యూటీ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోతోంది. లేటెస్ట్ గా విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ వల్ల తేలింది ఏంటంటే… ఈ భామని చూసేందుకు జనాలు థియేటర్లకు రారు.

అలా అని శ్రీముఖికి క్రేజ్ లేదని కాదు. కానీ ఆమె ఎంచుకునే చిత్రాలతోనే సమస్య. స్క్రిప్ట్ విషయంలో ఆమెకి జడ్జిమెంట్ లేదనిపిస్తోంది. అందుకే ఆమె నటించిన చిత్రాలేవి పెద్ద హిట్ కాలేదు. హీరోయిన్ గా ఆమె తోటి యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ కొన్ని విజయాలు అందుకున్నారు. కానీ శ్రీముఖికి ఆ లక్ కలిసి రాలేదు.

నిన్న విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం ఒక కామెడీ మూవీ. మనో, రాజా రవీంద్ర, భరణి హీరోలుగా నటించిన ఈ సినిమాలో శ్రీముఖి మెయిన్ రోల్ పోషించింది. ఆమె గ్లామర్ కూడా ఈ సినిమాకి ప్లస్ కాలేదని రివ్యూస్ చెప్తున్నాయి.

‘జులాయి’ సినిమాలో చిన్న పాత్రతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన శ్రీముఖి నుంచి ఆ తర్వాత ‘బాబు బాగా బిజీ’, ‘ఆంధ్రాపోరి’, ‘సావిత్రి’ వంటి సినిమాలు వచ్చాయి. ఆమెకి ఏ మూవీ కూడా క్రేజ్ తీసుకురాలేదు. ఐతే, బుల్లితెరపై మాత్రం ‘అదుర్స్’, ‘పటాస్’, ‘సూపర్ సింగర్’, ‘భలే ఛాన్స్ లే’, ‘బొమ్మ అదిరింది’, ‘బిగ్ బాస్’, ‘కామెడీ నైట్స్’ వంటి షోలు మాత్రం క్లిక్ అయ్యాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ లలో కూడా పాపులారిటీ పెరిగింది.

Also Check: Sreemukhi’s random selfies

 

More

Related Stories