ఈసారైనా క్లిక్ అవుతుందా?

శ్రీముఖి.. బుల్లితెరపై స్టార్ యాంకర్. రాములమ్మ అనే బిరుదుతో సూపర్ ఎనర్జీతో చెలరేగిపోతుంది. కానీ సినిమాల విషయానికొచ్చేసరికి మాత్రం శ్రీముఖి తుస్సుమనిపిస్తోంది. ఇప్పుడుకాదు, దాదాపు 8 ఏళ్లుగా ఆమె సినిమాలు చేస్తోంది. కానీ ఏ ఒక్కటి ఆమెకు కలిసిరావడం లేదు.

ఓవైపు అనసూయ, ఇటు సినిమాలు అటు టీవీ కార్యక్రమాలతో దూసుకుపోతోంది. రష్మీ కూడా ఉన్నంతలో తన సినిమాలతో ఆకట్టుకుంటోంది. హిట్ అవ్వకపోయినా బజ్ క్రియేట్ చేయగలుగుతోంది. కానీ శ్రీముఖి మాత్రం పెద్దగా మెప్పించలేకపోతోంది. దీనికి కారణం ఆమె పర్సనాలిటీకి లీడ్ రోల్స్ రాకపోవడమే.

ఉన్నంతలో చిన్నా చితకా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఆ అరకొర పాత్రలతో మెప్పించలేకపోతోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఎలా తయారైందంటే.. ఆమె నటించిన 2 సినిమాలు రిలీజ్ కూడా అవ్వకుండా ఆగిపోయాయి. అది చాలదన్నట్టు తాజాగా మరో సినిమా మొదలుపెట్టింది శ్రీముఖి. ”క్రేజీ అంకుల్స్” అనే సినిమాలో ఆమె కనిపించబోతోంది.

ముగ్గురు అంకుల్స్, ఓ అమ్మాయిపై మనసుపడిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నానని, కచ్చితంగా ఈసారి క్లిక్ అవుతానంటోంది శ్రీముఖి. ఆల్ ది బెస్ట్ రాములమ్మ.

Also Check: Sreemukhi – Pics

Related Stories