అదంతా డ్రామా: శ్రీముఖి

Sreemukhi

యాంకర్ విష్ణుప్రియతో తన ఫ్రెండ్ షిప్ అంతా ఫేక్, డ్రామా అంటోంది మరో యాంకర్ శ్రీముఖి. ఇటీవలే “ఉమెనియా” అని పది ఎపిసోడ్ లు చేసి క్లోజ్ చేసింది శ్రీముఖి. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని కూడా కలిసింది. వీటన్నింటి గురించి క్లారిటీ ఇస్తూ శ్రీముఖి చెప్పిన సంగతులు…

కాబోయే శ్రీవారు ఎవరు?
ప్రస్తుతానికి శ్రీముఖి వారు. శ్రీవారు ఎవరనేది చూద్దాం.

‘ఉమెనియా’ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు?
అది ఫాస్ట్ గా క్లోజ్ చేయడం లేదు. 10 ఎపిసోడ్లు అనుకున్నాం. అందుకే ఆపేస్తున్నాం. నాక్కూడా బాధగానే ఉంది. మరో సీజన్ కోసం తర్వాత ఆలోచిస్తా.

యాంకర్ విష్ణుప్రియ నిజంగా అంత బెస్ట్ ఫ్రెండా?
అంతా ఫేక్. అంతా కెమెరా కోసమే. ఇద్దరు ఆడాళ్లు ఎక్కడైనా ఫ్రెండ్స్ అవుతారా? విష్ణుప్రియ నాకు ఫ్రెండ్ ఏంది? (నవ్వుతూ) ఊరికే అంటున్నా… నిజంగా విష్ణుప్రియ నాకు మంచి ఫ్రెండ్.

Also Read: Vishnu Priya Photos

పవన్ కళ్యాణ్ ను కలిశావు.. ఏంటి కథ?
అవును.. మా సెట్ పక్కనే ”వకీల్ సాబ్” షూటింగ్ కూడా జరుగుతోంది. జానీ మాస్టర్ వెళ్లి కలుద్దామన్నారు. నేను ఎందుకు కాదంటాను. వెళ్లి కలిశాం. సెట్స్ లో ఆయన ఆరా (aura) నెక్ట్స్ లెవెల్.

Also Read: Sreemukhi Photos

షూట్ లో మూడ్-ఆఫ్ అయితే ఏం చేస్తావ్?
నా రూమ్ కు వెళ్తాను. అద్దం ముందు నిల్చుంటాను. ”కచ్చితంగా ఇంటికెళ్లి ఫీల్ అవ్వు, ఫస్ట్ వర్క్ పూర్తిచేయి” అని నాకు నేను చెప్పుకుంటాను.

Related Stories