శ్రీముఖికి ఇక ఆ పాత్రలే ఫిక్స్!

బుల్లితెరపై గ్లామర్ భామ అనే పేరు ఉంది శ్రీముఖికి. కానీ వెండితెరపై మాత్రం పూర్తి భిన్నమైన ఇమేజ్. ఇటీవలే విడుదలైన ‘మాస్ట్రో’ సినిమా చూస్తే చాలు ఆమెని మన దర్శక, నిర్మాతలు ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్’ని చేశారని అర్థమవుతుంది. విలన్ పాత్రలు పోషించే జిస్సు సేన్ గుప్తాకి భార్యగా నటించింది. చాలా చిన్న పాత్ర అది.

శ్రీముఖి హీరోయిన్ గా నటించిన సినిమాలేవీ ఆడలేదు. రీసెంట్ గా ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. అది కూడా ఆడలేదు. అందుకే, ఆమెకి ఇప్పుడు ‘క్యారెక్టర్ రోల్స్’ ఇస్తున్నారు మేకర్స్. ఇకపై ఆమెని హీరోయిన్ గానో, ఐటెం గాళ్ గానో చూడలేం కావొచ్చు. శ్రీముఖి స్థాయిని తగ్గించేశారు మన మేకర్స్ ఇప్పటికే.

బుల్లితెరపై యాంకర్ గా మాత్రం గ్లామర్ డాల్ లుక్ లోనే కనిపిస్తుంటుంది. మరోవైపు ఈ అందాల సుందరి సినిమాల్లో అవకాశాల కన్నా బుల్లితెరపై, యూట్యూబ్ పై ఎక్కువ రాణించాలనుకుంటోంది. త్వరలోనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తుందట.

భవిష్యత్ సినిమా కాదు డిజిటల్ మీడియా అని భావిస్తోంది ఈ బ్యూటీ.

Also Check: Sreemukhi New Pictures

 

More

Related Stories