అది వొద్దు, ఇంకేదైనా అడగండి

Sreemukhi

శ్రీముఖికి రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న… పెళ్లి గురించే. ఆమె ఇప్పటికే ఎన్నో సార్లు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. అయినా…తన అభిమానులతో ఎప్పుడు చాటింగ్ చేసినా… వాళ్ళు ఈ ప్రశ్న వెయ్యకుండా ఉండడం లేదు. అందుకే.. ఈ సారి చాటింగ్ స్టార్ట్ చేసే ముందే… ఆ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగొచ్చు అని ఒక డిస్ క్లైమర్ పెడుతోంది.

29 ఏళ్ల శ్రీముఖికి ఇన్ స్టాగ్రాంలో 34 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువగా ఈ సోషల్ మీడియా వేదికని ఎంచుకొని అభిమానులతో కనెక్ట్ అవుతుంటుంది. బుల్లితెరపై యాంకర్ గా పాపులరయిన శ్రీముఖి ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఎంట్రప్రెన్యూర్ గా మారింది.

ఇక ఆమె డేటింగ్ గురించి కూడా చాలా పుకార్లు ఉన్నాయి. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన తెస్తే… చిరాకు పడుతుంది.

More

Related Stories