మొత్తానికి వైట్లకి ఓ హీరో దొరికాడు!

Srinu Vaitla


శ్రీను వైట్ల… ఒకప్పుడు బాగా వెలిగిన దర్శకుడు. పెద్ద హీరోలందరూ పోటీలుపడి డేట్స్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు శ్రీను వైట్ల అనే దర్శకుడు ఉన్నాడు అన్న విషయం ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకులు మర్చిపోయారు. ఎందుకంటే… ఆయన ఇచ్చిన ఫ్లాపులు అలాంటివి.

‘ఆగడు’,’బ్రూస్ లీ’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘మిస్టర్’…. అబ్బో ఆయన ప్రేక్షకులకు అందించిన తలనొప్పి కళ’ఖండాలు’ అలాంటివి. అందుకే, వైట్లతో సినిమా అంటే అమ్మ బాబోయ్ అని పారిపోయ్యే స్థితి. ఆఖరికి మంచు విష్ణు కూడా శ్రీను వైట్లతో ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ అని ప్రకటించి పక్కన పెట్టేశారు. ఆ దర్శకుడు గురించి హీరోలు ఏమనుకుంటున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి టైంలో, తనకి ఎలాంటి సంబంధం, ఆబ్లిగేషన్ లేని ఒక హీరో శ్రీను వైట్లకి ఆఫర్ ఇవ్వడం విశేషం. ఆ హీరో గోపీచంద్.

శ్రీనువైట్ల తన తదుపరి చిత్రం గోపీచంద్ తో అని ఈ దసరా సంధర్భంగా ప్రకటించారు. అఫ్కోర్స్, గోపీచంద్ కెరీర్ కూడా కష్టాల్లో ఉంది. అన్నీ ఫ్లాపులే. మొన్నామధ్య విడుదలైన ‘పక్కా కమర్షియల్’కి 3 కోట్లకి మించి రాలేదు. గోపీచంద్ పరిస్థితి అది.

మరి మైనస్ మైనస్ ప్లస్ అవుతుందా? ఈ కాంబినేషన్ ఈక్వేషన్ విజయం ఇస్తుందా?

 

More

Related Stories