
తనకు అమ్మాయిలంటే చాలా ఇష్టమని, తనకి సంబంధాలు కూడా ఎక్కువే అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు తానుగా ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాడు. అలాంటి దర్శకుడితో తాజాగా వర్క్ చేసింది శ్రీ రాపాక అలియాస్ స్వీటీ. సో.. ఈమెను వర్మ కమిట్ మెంట్ అడిగే ఉంటాడని చాలామంది అనుకున్నారు. అయితే అలాంటిదేం లేదంటోంది స్వీటీ.
వర్మ దర్శకత్వంలో “నగ్నం” అనే అడల్ట్ మూవీ చేసిన స్వీటీ.. ఆర్జీవీ కంపెనీలో కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని, అలాంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదని అంటోంది.
“వర్మ నన్ను ఏమీ అడగలేదు. కొద్దీ రోజుల్లోనే సినిమా అయిపోయింది. కేవలం డైలాగ్స్, షాట్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కాఫీ తాగుతూ డిస్కషన్ పూర్తిచేసేవాళ్లం. ఆయన నన్ను కమిట్ మెంట్ అడగలేదు. డ్రింక్ అలవాటుందా అని మాత్రమే అడిగారు. లేదని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు,” అని చెప్పింది శ్రీ రాపాక.
అలాగే, తప్పనిసరిగా కమిట్ మెంట్ ఇవ్వాల్సి వస్తే సినిమా చేయనని మొహం మీద చెబుతాను అంటోంది ఈ ‘నగ్న’సుందరి.