శ్రీ రాపాక తగ్గట్లేదుగా!

Sri Rapaka

శ్రీ రాపాక అలియాస్ స్వీటీ గుర్తుందా.. లాక్ డౌన్ టైమ్ లో ‘నగ్నం’ అనే సినిమాతో రెచ్చిపోయింది ఈ ఆంధ్రా అందగత్తె. అప్పట్లో ఆమె హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి వర్మ తీసిన అన్ని సినిమాల్లానే ఆ 22 నిమిషాల షార్ట్ ఫిలిం కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అయితే ‘నగ్నం’ ఫ్లాప్ అయినా శ్రీ రాపాక హిట్టయింది. ఆమెకు ఇప్పుడు మరో సినిమా ఆఫర్ వచ్చింది.

శ్రీ రాపాక కొత్త సినిమా పేరు ‘లస్ట్’. ఏ మర్డర్ మిస్టరీ అనేది ట్యాగ్ లైన్. ఇది మాత్రం వర్మ తీసిన ‘నగ్నం’ లాంటి షార్ట్ ఫిలిం కాదు. ఫుల్ లెంగ్త్ మూవీ. కాకపోతే ఓటీటీని దృష్టిలో పెట్టుకొని తీసిన వెబ్ సినిమా.

‘లస్ట్’ లో శ్రీరాపాక క్యారెక్టర్ ఏంటనేది చెప్పుకోవడం కంటే ఆమె ఎంతలా రెచ్చిపోయిందనేది మాట్లాడుకోవడం బెటర్. వర్మ చూపించిన యాంగిల్స్ నే దాదాపు ఇందులో కూడా చూపించిన శ్రీ రాపాక.. దానికి అదనంగా ఈసారి అడల్ట్ కంటెంట్ ను ఇంకాస్త ఎక్కువగా చూపించింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు. అది కూడా వర్మ చేతుల మీదుగా.

Related Stories