అఖండ చేసిన మేలు!

Srikanth


ఒకప్పుడు హీరోగా వెలిగిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. ‘అఖండ’ సినిమాలో విలన్ గా నటించి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. దాంతో, పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు దక్కుతున్నాయి.

రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న పాన్ ఇండియా చిత్రంలో శ్రీకాంత్ కి మంచి పాత్ర దొరికింది. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న కొత్త చిత్రంలో శ్రీకాంత్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చెయ్యనున్నారు.

నిజానికి శ్రీకాంత్ కెరీర్ ఎండ్ అయిపోయింది అన్న కామెంట్స్ ఆ మధ్య వినిపించాయి. కానీ, ఆయన తెలివిగా జగపతిబాబు మార్గాన్ని ఎంచుకున్నారు. అలా విజయం దక్కించుకొని బిజి అయిపోయారు. శ్రీకాంత్ కొడుకు హీరోగా ఇప్పటికే విజయం అందుకున్నాడు. ‘పెళ్లి సందD’ చిత్రంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో.

జగపతిబాబుకి ఎలాగైతే సెకండ్ ఇన్నింగ్స్ బోయపాటి సినిమా (లెజెండ్) వల్ల దక్కిందో, శ్రీకాంత్ కి కూడా బోయపాటి వల్లే కొత్త కెరీర్ మొదలైంది.

 

More

Related Stories