పెద్ద హిట్… ఐనా ఆఫర్లేవీ?

ఆమె ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించింది. అందులో రెండు చిత్రాలు KGF భాగాలే. ‘KGF1’, ‘KGF2’ సినిమాలతో పేరు తెచ్చుకొంది శ్రీనిధి శెట్టి. ఆ రెండూ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. రెండో భాగం ఐతే, దేశమంతా సంచలన విజయం సాధించింది.

అంత పెద్ద హిట్ సినిమాల్లో నటిస్తే ఏ హీరోయిన్ అయినా బిజీ బిజీ అయిపోతుంది. కానీ, శ్రీనిధికి మాత్రం అలా ఆఫర్లు పలకరించడం లేదు. ఆమె మూడో చిత్రంగా ఇటీవలే ‘కోబ్రా’ విడుదలైంది. ఇందులో ఆమె విక్రమ్ సరసన నటించింది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్. దాంతో, ఆమెకి KGF1 & KGF2లతో వచ్చిన క్రేజ్ అంతా హుష్ కాకి అయింది.

ఇప్పుడు తెలుగులో, హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ, నిర్మాతలు, దర్శకులు అంతగా ఆసక్తి చూపడం లేదట.

ALSO CHECK: Srinidhi Shetty’s mid-week Blues

మంచి అందెగత్తె ఈ భామ. చరిత్ర సృష్టించిన సినిమాలో నటించింది. కానీ అదృష్టమే వెక్కరిస్తోంది. అంతేకాదు, ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో కూడా పెద్దగా ఫాలోవర్స్ పెరగడం లేదు. ఇంకా నాలుగు మిలియన్ల వద్దే ఉంది.

 

More

Related Stories