దిల్ రాజుకి టాటా చెప్పనున్న వేణు?

Sriram Venu

ఇది ఇంతవరకు నిజమో తెలియదు కానీ ఒక గాసిప్ గుప్పుమంది. దిల్ రాజు కాంపౌండ్ లో పెరిగిన దర్శకుడు వేణు శ్రీరామ్ అక్కడి నుంచి బయటికి వస్తున్నాడనే ప్రచారం మొదలైంది.

శ్రీరామ్ వేణుకు ఇటీవల ‘వకీల్ సాబ్’తో కొంత గుర్తింపు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అది ప్లాప్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ దిల్ రాజే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు.


నానితో తీసిన ‘ఎంసిఏ’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ కాగానే దిల్ రాజు అల్లు అర్జున్ కి వేణు శ్రీరామ్ తో కథ చెప్పించారు. ‘ఐకాన్’ అనే సినిమా  సెట్ అయింది. కానీ ఎందుకో అల్లు అర్జున్ దాన్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురంలో’, సుకుమార్ తో ‘పుష్ప’ సెట్ చేసుకున్నాడు.

దాంతో శ్రీరామ్ వేణు మళ్ళీ హీరో కోసం వెతుకున్నే పనిలో ఉండగా… దిల్ రాజే ‘వకీల్ సాబ్’ సెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ వంటి బిగ్ హీరోని ఒప్పించాడు. ఈ సినిమాతో శ్రీరామ్ వేణుకి కమర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ పెరిగింది. దాంతో అతనికి ఇతర నిర్మాణ సంస్థల నుంచి పిలుపులు అందాయట. 

సో… మంచి పారితోషికం కోసం టెంప్ట్ అయి శ్రీరామ్ వేణు దిల్ రాజు క్యాంప్ నుంచి బయట పడుతున్నాడు అనేది టాక్. మరి ఇందులో నిజమెంతో చూడాలి.

Advertisement
 

More

Related Stories